Reading Time: < 1 minute
Shani Parivartan 2026 Saturn Revati Nakshatra Positive Impact On 4 Zodiac Signs

Shani Parivartan 2026: మే 17వ తేదీ నుంచి శని గ్రహం నక్షత్ర మార్పు జరుగుతోంది. శని దేవుడు బుధ నక్షత్రమైన రేవతిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 09 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటారు. రేవతిలోకి శని ప్రవేశం తర్వాత ముఖ్యంగా 4 రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభ, తుల, మకర, కుంభ రాశుల వారికి జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుంది.

తులా రాశి:

తులా రాశి వారికి శని యోగకారకుడు. ఈ రాశి వారికి శని నక్షత్ర పరివర్తన ప్రయోజకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు జీతం పెరగడం లేదా కొత్త అవకాశాలు రావడం వంటివి జరుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆఫీసుల్లో మీ పనికి గుర్తింపు, మీ ప్రతిష్ట పెరుగుతుంది. పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది.

మకర రాశి:

మకర రాశి వారిపై ఒత్తిడి తగ్గుతుంది. సమస్యలు తగ్గుముఖం పడుతాయి. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించవచ్చు.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి కూడా ఈ నక్షత్ర పరివర్తన పాజిటివ్‌గా ఉంటుంది. సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా మెరుగుదల సంకేతాలు ఉన్నాయి. అయితే, మాట్లాడే సమయంలో సహనం చాలా అవసరం. ఆలోచనాత్మకంగా మాట్లాడటం ప్రయోజనకరంగా ఉంటుంది.