Reading Time: < 1 minute
Bigg Boss Fame Prince Yawar Honey Trap Allegations Builder Nawaz Fraud

Prince Yawar: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ తాజాగా వార్తల్లో నిలిచారు. గచ్చిబౌలికి చెందిన నవాజ్ అనే బిల్డర్ తనను దారుణంగా మోసం చేశాడని, తిరిగి డబ్బులు అడిగితే తన కుమార్తెతో ‘హనీ ట్రాప్’ చేయించి ఇరికించాడని యావర్ సంచలన ఆరోపణలు చేశారు.

READ ALSO: Dhurandhar 2: ధురందర్-2లో హైలెట్‌గా ‘‘షిరానీ బలోచ్’’.. ఈ రోల్‌ పాకిస్తాన్ లీడర్‌‌దా..?

అసలు ఏం జరిగిందంటే..
యావర్ కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన బిల్డర్ నవాజ్ మొదట తన కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని యావర్‌కు దగ్గరయ్యాడు. ఆ నమ్మకంతోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో యావర్ నుంచి సుమారు రూ.23 లక్షలు వసూలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మొత్తానికి బదులుగా రూ.40 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. తీరా సమయం వచ్చాక యావర్ తన డబ్బులు తిరిగి అడగడంతో నవాజ్ అసలు రంగు బయటపడింది. డబ్బులు ఇవ్వకపోగా యావర్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో చేసేదేమీ లేక యావర్ మొదట చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హనీ ట్రాప్ ట్విస్ట్..
FIR నమోదైన తర్వాత ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యావర్‌కు ఇవ్వాల్సిన డబ్బుల నుంచి తప్పించుకోవడానికి నవాజ్ తన కుమార్తెతో కలిసి ‘హనీ ట్రాప్’ ప్లాన్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో యావర్‌పై తప్పుడు కేసు పెట్టించినట్లు తెలుస్తోంది. తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఒక పద్ధతి ప్రకారం తనను ట్రాప్ చేశారని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పోలీస్ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

READ ALSO: Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!