July 14, 2026

ఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి

ఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
Reading Time: < 1 minute

ఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్: ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు ఆర్య వైశ్యులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం (మార్చి 22) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో శ్రీ వాసవి మహోత్సవ్ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఆర్య వైశ్యలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఆరు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒకటి ఆర్య వైశ్యులకు ఇచ్చామని తెలిపారు. అఖండ భారత దేశంలో అహింసాతో యుద్ధాన్ని గెలవచ్చని చూపించిన మహాత్మ గాంధీ కూడా ఆర్య వైశ్యుడేనని పేర్కొన్నారు. ఎలాంటి హింసా యుద్ధం చేయకుండా బ్రిటీషర్స్‎ను భారత నుంచి తరిమి కొట్టారని అన్నారు. 

►ALSO READ | రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వైశ్య సమాజానికి అండగా ఉంటుందని.. సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆర్య వైశ్యుల పండగలను అధికారికంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.102 చరణాలతో కూడిన వాసవీ పారాయణన్ని గినిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేస్తున్న ఆర్యవైశ్య సమాజానికి కంగ్రాట్స్ చెప్పారు. 

 

©️ VIL Media Pvt Ltd.