July 8, 2026

కరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. 

కరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. 
Reading Time: < 1 minute

కరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. 

Caption of Image.

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించడంతో తట్టుకోలేకపోయిన భార్య పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ( మార్చి 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… జిల్లాలోని వీణవంక మండలం మామిడాలపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. మామిడాల పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మ బార్యాభర్తలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య మరణించాడు.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య పద్మ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పద్మ కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. 

►ALSO READ | గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టురట్టు.. భారీగా వంట నూనె, గోధుమ పిండి సీజ్….

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త మరణం తట్టుకోలేకనే పద్మ ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు 

©️ VIL Media Pvt Ltd.