July 8, 2026

Uttam Nagar Tarun Case: తరుణ్‌ను చంపిన నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్..

Uttam Nagar Tarun Case: తరుణ్‌ను చంపిన నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్..
Reading Time: < 1 minute
Uttam Nagar Tarun Murder Bulldozer Action Nizamuddin Delhi

Uttam Nagar Tarun Case: ఢిల్లీలో ఉత్తమ్ నగర్ ఘటన దేశవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. హోలీ రోజు 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడిని పొరుగున ఉండే ముస్లిం కుటుంబం దారుణంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటనపై హిందువులు భగ్గుమంటున్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) నిందితుడు నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించాయి. నిందితుడి ఇంటి కూల్చివేత ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారు.

ఉత్తమ్ నగర్ ఘటన తర్వాత నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని హిందువులు డిమాండ్ చేశారు. నిందితుడు తన ఇంటిని వివాదాస్పద స్థలంలో నిర్మించినట్లు పేర్కొంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. పరిస్థితి దృష్ట్యా ఆ ప్రాంతంలో భారీ పోలీస్ బలగాలను మోహరించారు. శాంతిభద్రతలను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

హోలీ రోజు వివాదం:

హోలీ రోజు నీటి బెలూన్ ఒక ముస్లిం మహిళపై పడటంతో వివాదం ప్రారంభమైంది. చిన్న పాప తెలియకుండా పైఅంతస్తు నుంచి రోడ్డుపై నీటి బెలూన్ విసిరింది. సదరు మహిళ దీనిని ఒక పెద్ద వివాదంగా మార్చింది. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తరుణ్, అతడి కుటుంబంపై ముస్లిం కుటుంబం తీవ్రంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన తరుణ్ ఆస్పత్రిలో మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తరుణ్‌కు న్యాయం జరగాలని హిందూ సంఘాలు, ప్రజలు రోడ్డెక్కారు. ఈ వివాదం ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.