Reading Time: < 1 minute

మియాపూర్ లో విషాదం.. ప్రేమ విఫలమై యువ నర్స్ ఆత్మహత్య

Caption of Image.

హైదరాబాద్   మియాపూర్ లో విషాదం చోటుచేసుకుంది.  ప్రేమ విఫలమైందనే కారణంతో ఓ  యువ నర్స్ ఆత్మహత్య  చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన మేఘావతు సోను భాయ్(20) గా గుర్తించారు.

మియాపూర్ మక్తలోని ఓ  హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా విధులు నిర్వహిస్తోంది సోను భాయ్. గత సంవత్సరం కాలంగా ఒక యువకుడితో ప్రేమలో ఉంది. ప్రేమ విఫలమైనందున  హాస్టల్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది  సోను భాయ్. 

 ఘటనా ఘటనా  న స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.