
గరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు, యువతి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం…సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విధులు ముగిసిన తర్వాత ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎపికి చెందిన యువతి అక్షిత ర్యాడ్ బూక్ చేయడంతో ఆమెను తీసుకుని బైక్‌పై బయలు దేరాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అక్షిత ఎపిలోని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.