Reading Time: < 1 minute
IAF Agniveervayu Jobs 2026: పదో తరగతి అర్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. అవివాహిత పురుషులకు మాత్రమే ఛాన్స్‌

అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా భారత వాయుసేన అగ్నివీర్‌ వాయు నాన్-కంబాటెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాయుసేన కేంద్రాలలో హాస్పిటాలిటీ, హౌస్‌కీపింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

హాస్పిటాలిటీ, హౌస్‌ కీపింగ్ విభాగాల్లో అగ్నివీర్‌ వాయు నాన్-కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ పోస్టులకు కేవలం అవివాహిత పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే వయసు 21 సంవత్సరాలకు మించకూడదు. అంటే అభ్యర్ధులు జులై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 23, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, ఎస్‌ఎస్‌టీ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 జీతంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్ల కాంట్రక్టు కింద ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.