Reading Time: < 1 minute

మహిళ టీ20 విజేత వరంగల్.. పోరాడి ఓడిన మహబూబ్ నగర్ టీం

Caption of Image.

ధర్మసాగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా జరిగిన మహిళల టీ–20 ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వరంగల్ మహిళా జట్టు ఉత్కంఠభరిత ఫైనల్‌‌‌‌లో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌‌‌‌గా అవతరించింది. శనివారం వంగాలపల్లిలో జరిగిన ఫైనల్‌‌‌‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 98 పరుగులు చేయగా, ఓపెనర్ దృవిగ్న్య 38 పరుగులతో రాణించింది.

మహబూబ్‌‌‌‌నగర్ బౌలర్లు త్రివేణి మూడు, అక్షర రెండు వికెట్లతో వరంగల్ స్కోరును కట్టడి చేశారు. లక్ష్య చేధనలో తొలి బంతికే వికెట్ కోల్పోయిన మహబూబ్‌‌‌‌నగర్ జట్టు, అరియాన 30 పరుగులతో పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులకే పరిమితమైంది. వరంగల్ బౌలింగ్‌‌‌‌లో స్పిన్నర్ అనూష 4 వికెట్లతో అద్భుతంగా రాణించగా, కృష్ణవేణి, సౌమ్య కీలక సమయాల్లో ఒత్తిడి సృష్టించారు. హెచ్‌‌‌‌సిఎ సెలెక్టర్లు హర్ష నారాయణ, కీర్తన చేతుల మీదుగా విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాజిమోద్దీన్, మాజీ కార్యదర్శి ఉదయభాను రావు, బండారి ప్రభాకర్, సదానంద యాదవ్, కుమార్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.