Reading Time: < 1 minute

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం… లిక్కర్ లో డెటాల్ పోసుకుని ఆత్మహత్య

Caption of Image.

జీడిమెట్ల, వెలుగు: భార్య పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త వీడియో కాల్‌‌లో మాట్లాడుతూనే డెటాల్ కలిపిన ఆల్కహాల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్​ కొంపల్లి నార్త్ ఎన్‌‌సీఎల్ కాలనీకి చెందిన ధర్మతేజ(27) ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌లో మెస్ ఇన్‌‌చార్జిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య తేజశ్రీతో వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. 

దీంతో గురువారం ఆమె ఇంటి నుంచి పుట్టిల్లు పల్నాడుకు వెళ్లిపోయింది. తీవ్ర మనోవేదనకు గురైన ధర్మతేజ భార్యకు వీడియోకాల్ చేసి మాట్లాడుతూనే ఆల్కహాల్‌‌లో డెట్టాల్ కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

©️ VIL Media Pvt Ltd.