
‘అమరన్’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి.. ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో మరో హీరోయిన్‌గా నటిస్తోందంటూ.. సోమవారం సాయిపల్లవి పేరును రివీల్ చేశారు.
ధనుష్, దర్శకనిర్మాతలతో ఆమె కలిసున్న ఫొటోను ఈ సందర్భంగా విడుదల చేశారు. ‘అమరన్’ చిత్రంలో రెబెకా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటన ఎంతలా మెప్పించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళంలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న సాయిపల్లవి.. మళ్లీ ఇదే చిత్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంతో కోలీవుడ్‌కు వెళ్తోంది.
She’s about grace and strength – all at once ❤️
Welcoming everybody’s favourite @Sai_Pallavi92 on board #D55. The hit combo returns to the big screen.@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr… pic.twitter.com/zycf0OiQKu
— Wunderbar Films (@wunderbarfilms) February 2, 2026
అంతేకాదు.. ధనుష్‌తో కూడా ఆమెకు ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘మారి 2’లోని ‘రౌడీ బేబి’ పాట ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాపై ఆసక్తి నెలకొంది. ధనుష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గూఢచారి కథతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
You didn’t see this coming 😉
Welcoming the dazzling damsel @sreeleela14 on board #D55 🔥@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr @vishurams pic.twitter.com/fROtGwO0T2
— Wunderbar Films (@wunderbarfilms) January 31, 2026
బాలీవుడ్‌లో ‘సీతమ్మ’గా..
సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’లో రణబీర్ కపూర్ (రాముడు) సరసన సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. జునైద్ ఖాన్ (అమీర్ ఖాన్ కుమారుడు) సరసన ‘ఏక్ దిన్’ సినిమాలో కూడా నటించింది
సాయి పల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా ఉండటమే ఆమె సక్సెస్ సీక్రెట్ అంటున్నారు అభిమానులు. కోట్లు సంపాదిస్తున్నా, స్టార్ హోదా ఉన్నా కూడా ఆమె లైఫ్ స్టైల్ చాలా సాధారణంగా ఉంటుంది. లగ్జరీ కార్లు, క్యారవాన్ల కంటే కథకే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది.
సౌత్ నుంచి నార్త్ వరకు, చిన్న దర్శకుల నుంచి కమల్ హాసన్, రజినీకాంత్ వంటి దిగ్గజాల వరకు అందరి ఫేవరెట్ హీరోయిన్‌గా మారడం అంటే మామూలు విషయం కాదంటున్నారు.. తన నటనతో, వ్యక్తిత్వంతో ఒక సరికొత్త ముద్ర వేసిన సాయి పల్లవి, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్..