Reading Time: < 1 minute

పార్లమెంట్‌‌ నిర్వహణకు రూ.1,492 కోట్లు.. లోక్ సభకు రూ.1,009 కోట్లు, రాజ్యసభకు రూ.482 కోట్లు

Caption of Image.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌లోని లోక్‌‌సభ, రాజ్యసభ నిర్వహణకు రూ.1,492 కోట్లు కేటాయించారు. లోక్‌‌సభ నిర్వహణకు రూ.1,009 కోట్లు అలాట్‌‌ చేయగా, ఇందులో లోక్‌‌సభ స్పీకర్‌‌‌‌, డిప్యూటీ స్పీకర్‌‌‌‌ జీతభత్యాల కోసం రూ.1.56 కోట్లు కేటాయించారు. మరో రూ.416.45 కోట్లు ఎంపీల జీతభత్యాల కోసం అలాట్‌‌ చేశారు.

 లోక్‌‌సభ సెక్రటేరియెట్‌‌ ఖర్చుల కోసం రూ.586.03 కోట్లు కేటాయించగా, ఇందులో సిబ్బంది, అధికారుల జీతాలు, గ్రాంట్స్‌‌ ఇన్‌‌ ఎయిడ్‌‌, సంసద్‌‌ టీవీపై ఖర్చులు కూడా ఉన్నాయి. రాజ్యసభకు రూ.482.99 కోట్ల కేటాయించగా, చైర్మన్‌‌, డిప్యూటీ చైర్మన్ల జీతభత్యాల కోసం రూ.2.55 కోట్లు అలాట్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడికి, ఆయన సెక్రటేరియెట్‌‌ జీతభత్యాల కోసం రూ.3.36 కోట్లు అలాట్‌‌ చేశారు. 

అధిక భాగం రూ.349.37 కోట్లు సెక్రటేరియెట్‌‌ నిర్వహణకు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్‌‌కు రూ.11..70 కోట్లు కేటాయించారు. ఈ నిధులు సిబ్బంది ఖర్చులు, తదితర అవసరాల కోసం వాడనున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.