Reading Time: < 1 minute
పొగరాయుళ్లకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ధరలు! రూ.10 సిగరెట్‌ ఇప్పుడు ఎంతో తెలుసా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై కొత్త పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పన్ను ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చింది. మరి పెరిగిన ధరల తర్వాత జనవరి 31 వరకు రూ.10 ఉన్న సిగరెట్‌ ధర ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం..

గతంలో సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. అలాగే సిగరెట్లపై పరిహార సెస్ విధించారు. ఈ పన్ను 2017 నుండి వర్తిస్తుంది. ఇప్పుడు పాత పన్ను విధానం రద్దు చేసి, కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, 40 శాతం GST విధించారు. అందుకే ఇప్పుడు ప్రతి సిగరెట్ ధర భారీగా పెరిగింది.

ఇప్పుడు రూ.10 విలువైన సిగరెట్లపై రూ.2 నుండి 3 వరకు ఎక్సైజ్ సుంకం ఉంటుంది. కాబట్టి రూ.10 సిగరెట్ ధర ఇప్పుడు రూ.12 నుండి 13కి పెరిగింది. అలాగే పది సిగరెట్ల ప్యాక్ గతంలో రూ.100కి లభించేది. ఇప్పుడు అదే ప్యాక్ రూ.130 నుండి రూ.140కి పెరిగింది. ప్రీమియం సిగరెట్లు కూడా ఇప్పుడు ఖరీదైనవిగా మారాయి. సిగరెట్‌కు రూ.3.6 నుండి రూ.4 వరకు పెరుగుదల ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి