Reading Time: 2 minutes

నల్గొండ జిల్లాలో నర్సు పోస్టులు.. పరీక్ష లేదు, కేవలం మెరిట్ ద్వారా సెలక్షన్.. ఇలా అప్లై చేసుకోండి!

Caption of Image.

నల్గొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ, నల్గొండ) పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 24.

విభాగాల వారీగా ఖాళీలు:  ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్​నర్స్ 13, ఏఎన్ఎం 3, అనస్థీషియాలజిస్ట్ 3, ఓబీజీ స్పెషలిస్ట్ 2, సీనియర్ డాట్స్ ఫ్లస్ టీబీ హెచ్ఐవీ 1, ఓటీ టెక్నీషియన్ 1. 

విద్యార్హతలు
ల్యాబ్ టెక్నీషియన్: ఇంటర్మీడియట్, ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీలో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే, తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

స్టాఫ్ నర్స్: జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం: మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళా) ట్రైనింగ్ కోర్సు ఉత్తీర్ణులై, తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైవ్స్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయి ఉండాలి. లేదా ఏడాది క్లినికల్/అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ శిక్షణతో కూడిన ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళా) ట్రైనింగ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

అనస్థీటిస్ట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఎంబీబీఎస్​తోపాటు అనస్థీషియాలజీలో ఎండీ లేదా డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ పూర్తిచేసి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

ఓబీజీ స్పెషలిస్ట్: ఎంబీబీఎస్ తోపాటు ఎంఎస్, ఎండీ (గైనకాలజీ), డీజీఓ లేదా డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇన్ ఆబ్టెట్రిక్స్ & గైనకాలజీ వంటి పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐవీ: ఏదైనా డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి శానిటరీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ కోర్సు, కనీసం 2 నెలల కంప్యూటర్ ఆపరేషన్ కోర్సు సర్టిఫికెట్​తోపాటు పర్మినెంట్ టూ-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ఓటీ టెక్నీషియన్: ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో డిప్లొమా (డీఓటీటీ లేదా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ఓటీ టెక్నాలజీలో డిప్లొమా లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో బీఎస్సీ /  బీఓటీటీ డిగ్రీ పూర్తిచేసి, తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 25. 

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.200 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 3. 

సెలెక్షన్ ప్రాసెస్: ప్రతి పోస్టుల కేటగిరీకి ప్రత్యేకంగా మెరిట్ జాబితాలను రూపొందిస్తారు. అర్హత పరీక్ష ఆధారంగా 90 మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థి వయసును అనుసరించి 10 మార్కులు అదనంగా కలుపుతారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nalgonda.telangana.gov.inను సందర్శించండి.  

©️ VIL Media Pvt Ltd.