Reading Time: < 1 minute

పెండింగ్ ఛలాన్ల ఫైన్ను కరెంట్ బిల్లులో కలిపేయండి: సుప్రీం కోర్టు

Caption of Image.

పెండింగ్ ఛలాన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. విద్యుత్ బిల్లులకు పెండింగ్ ఛలాన్ల జరిమానాలను జోడించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇలా చేయడం వల్ల.. చెల్లించని ట్రాఫిక్ ఛలాన్లను విద్యుత్ బిల్లులకు అనుసంధానించడం ద్వారా.. బకాయిలో ఉన్న  జరిమానాలను వసూలు చేయొచ్చని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సూచించింది. ఈ ఆలోచనను పరిశీలించాలని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది.

ట్రాఫిక్ ఉల్లంఘనలు, చెల్లించని జరిమానాల వసూలుకు సంబంధించిన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కీలక సూచన చేసింది. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు ₹45,000 కోట్ల ఈ-ఛలాన్ బకాయిలు ఉన్నాయని.. అందులో దాదాపు ₹25,000 కోట్లు వసూలు అయ్యాయని కోర్టుకు పిటిషనర్ తెలియజేశారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించని సందర్భాల్లో విద్యుత్ కనెక్షన్లను నిలిపివేయడాన్ని అధికారులు పరిగణించవచ్చని జస్టిస్ పర్దివాలా సూచించారు. అంతేకాదు.. చెల్లించని ఈ-ఛలాన్లు ఉన్న వాహనాలను జప్తు చేయవచ్చని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

►ALSO READ | ఎవరైనా మా దగ్గరకు రావాల్సిందే: NCP విలీనంపై శరద్ పవార్ క్లారిటీ

పెండింగ్ ఛలాన్ల జరిమానాలను చెల్లించే వరకు డ్రైవింగ్ లైసెన్సులను నిలిపివేయడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల పునరుద్ధరణను పరిమితం చేయడం, ఫిట్‌నెస్, పొల్యూషన్-అండర్-కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ల జారీని నిలిపివేయడం కూడా చేయవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. అటువంటి వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయవచ్చని కూడా కోర్టు సూచించింది. ఇవి విచారణ సమయంలో చేసిన సూచనలు మాత్రమేనని.. తుది నియమాలు లేదా ఆదేశాలు కావని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.