
- CPR చేసినా దక్కని ప్రాణాలు
- సిద్దిపేట జిల్లా సింగాటంలో ఘటన
సిద్దిపేట, వెలుగు: వినాయక నిమజ్జన ర్యాలీలో డీజే ఆపరేట్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింగాటం గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు.
కొలుగూరు గ్రామానికి చెందిన బండారి దినేశ్(22) నిమజ్జన ర్యాలీలో డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడికి సీపీఆర్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీజే సౌండ్, వైబ్రేషన్ల మధ్య పనిచేస్తున్న సమయంలో దినేశ్‌కు గుండెపోటు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.