
పాయల్ చెంగప్ప లీడ్ రోల్‌లో నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ‘మయూఖ’. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ ‘ఈ కథ వింటున్నంత సేపూ థ్రిల్ ఫీల్ కలిగింది. ఓ అమ్మాయి అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గూస్ బంప్స్ తెప్పించింది.
ఈ సినిమా అందరికీ కొత్త ఫీల్ కలిగిస్తుంది’ అని చెప్పింది. డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్ . కె. మాట్లాడుతూ ‘ఇలాంటి చిత్రాలు తెలుగులో అరుదుగా వస్తాయి. హాలీవుడ్, కొరియన్ మూవీ తరహాలో కలర్ గ్రేడింగ్ చేశాం. కచ్చితంగా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాం’ అని చెప్పాడు.
చక్కని కంటెంట్‌తో దసరాకు రాబోతున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత శశిధర్ అన్నారు. నటీనటులు అభిలాష్ అడ్డ, దేవ్ డి, రఘు వాసిరెడ్డి, నానానీ కర్రి, మాస్టర్ షణ్ముఖ చరణ్, బేబి మది నస్రీన్ పాల్గొన్నారు.