Reading Time: 2 minutes

విరాట్‌ కొంచెం కూడా మారలేదు: వన్డే వరల్డ్ కప్ జర్నీపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

* రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు కీలకంగా మారిన విరాట్, రోహ్లీ

* Ro-Ko ట్యాగ్‌ని చూసి నేను విరాట్ కోహ్లీ తెగ నవ్వుకుంటాం: రోహిత్

* ఇన్నేళ్లు అయినా కూడా విరాట్ కొంచెం కూడా మారలేదు: హిట్ మ్యాన్ 

Rohit Sharma: గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ద్వయం కీలక స్తంభాలుగా నిలిచింది. అభిమానుల అంచనాలు, నిరంతర మీడియా చర్చల నడుమ వీరిద్దరి మధ్య ఉన్న బంధం పరస్పర గౌరవం, సరదా సంభాషణలు, దేశం పట్ల అంకితభావంతో కొనసాగుతుంది. వెస్టిండీస్‌తో గౌహతిలో జరగనున్న రెండో వన్డేకి ముందు జియోస్టార్‌ (JioStar) ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో తనకున్న బంధం, Ro-Ko ట్యాగ్‌పై మొదటి స్పందన, 2027 వరల్డ్ కప్ సన్నాహాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ro-Ko ట్యాగ్‌పై రోహిత్ రియాక్షన్: 

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన Ro-Ko ట్యాగ్ పై రోహిత్ మాట్లాడుతూ.. మేము ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు లేదా ఆస్ట్రేలియా పర్యటన ముగిసి భారత్ వచ్చాక ఈ ట్యాగ్ ప్రారంభమైంది. టీవీల్లో ఈ Ro-Ko పదం టీవీల్లో, సోషల్ మీడియాలో వినిపించినప్పుడు మేమిద్దరం ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటాం.. ఇది చాలా సరదాగా ఉంటుంది. అభిమానులకు కొంత మసాలా (వినోదం) కావాలి కాబట్టి, ఇది నడుస్తోందని పేర్కొన్నాడు. 

కెప్టెన్సీ, పరస్పర సహకారం: 

రోహిత్ శర్మ 2007లో, విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్, టెస్ట్ మేస్ విజయాల్లో వీరిద్దరూ భాగమయ్యారు. కెప్టెన్సీ మార్పులు తమ సంబంధాన్ని మార్చలేదని రోహిత్ స్పష్టం చేశారు. విరాట్ జట్టు కోసం చేసిన దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు.. ముఖ్యంగా టెస్టు జట్టు కెప్టెన్‌గా అతను సాధించిన విజయాలు అద్భుతం.. ఒకరి బ్యాటింగ్‌పై మరొకరం నిరంతరం చర్చించుకుంటాం.. నా బ్యాటింగ్‌లో ఏమైనా లోపాలు ఉంటే తను చెప్తాడు, అలాగే నేను కూడా సలహాలు ఇస్తుంటాను అని తెలిపాడు. 

2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలు: 

2027 వన్డే వరల్డ్ కప్ గురించి పెద్ద పెద్ద చర్చలు అవసరం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. 2011, 2015, 2019, 2023 వరల్డ్ కప్‌లలో ఆడిన విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. వరల్డ్ కప్ ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ తెలుసు.. ముఖ్యంగా ఈ జట్టులో అత్యధిక వరల్డ్ కప్‌లు ఆడిన విరాట్‌కు దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు.. మైదానంలో ఉన్నప్పుడు ఎవరి బౌలింగ్‌పై దాడి చేయాలి, సింగిల్స్ ఎలా తీయాలి అనే దానిపైనే దృష్టి పెడతాం.. కొన్నిసార్లు కాళ్లకు చిన్న నొప్పులు ఉంటే సోదరా, కాస్త చూసి పరిగెత్తు అని సరదాగా డిస్కష్ చేస్తాం.. మేము కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మా మధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి మార్పూ లేదని రోహిత్ అన్నాడు. 

©️ VIL Media Pvt Ltd.