Reading Time: < 1 minute
Ranbir Kapoors Ramayana Part 1 Preponed

బాలీవుడ్ మాత్రమే కాదు హోల్ ఇండియా ఈగర్లీ వెయిట్ చేస్తోన్న ఫిల్మ్ రామాయణ. ఆల్రెడీ తెలిసిన కథే అయినా రూ. 4 వేల కోట్లతో ఏలా తెరకెక్కించడంతో గ్రాఫిక్స్‌ ఏ లెవల్లో ఉన్నాయన్న క్యూరియాసిటీయే సినిమాపై ఇంట్రస్ట్ కలిగిస్తోంది. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించిన రామాయణను టూ పార్ట్స్‌గా తీర్చిదిద్దారు. ఈ ఏడాది నవంబర్ 8న రామాయణ పార్ట్ మొదటి పార్ట్‌ రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చని టాక్.

రామాయణను నవంబర్ 5 లేదా 6న విడుదల చేయాలనుకుంటున్నారట. దీపావళికి రిలీజ్ చేస్తే పూజలు, టపాసులు పేల్చుకునేందుకు ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తారే తప్ప సినిమాపై కాన్సట్రేషన్ చేయరన్న ఉద్దేశంతో ప్రీ పోన్ చేస్తున్నారని బాలీవుడ్ బజ్. ఇక ఈ సినిమాను నార్త్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. రూ. 250 నుండి రూ. 350 కోట్ల లోపు డీల్ జరిగిందని బీటౌన్ ఇన్-సైడ్ టాక్. రామాయణ ప్రమోషన్స్‌లో కూడా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు మేకర్స్. స్టార్స్‌తో ప్రమోషన్స్ కన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్‌, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మి డోనాల్డ్ సన్‌ కోసం ఓ ఈవెంట్ నిర్వహించింది టీం. దీంతో పాన్ వరల్డ్ ప్రమోషన్స్ కవర్ చేసినట్లైంది. అంతకు ముందు కూడా కంటెంట్ క్రియేటర్స్ కోసం ఓ ఈవెంట్ నిర్వహించింది టీం. జెన్ జీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేందుకు ఇలా సరికొత్త ప్రచారానికి తెరలేపుతోంది. ప్రమోషన్స్ కోసమే సుమారు రూ. 300 కోట్లు ఖర్చు పెడుతుందట మూవీ టీం. టీం కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి మరి.