Reading Time: 2 minutes

‘బస్తీ బాయ్ లవ్ స్టోరీ’తో వస్తున్న మోహిత్, శ్రీజిత ఘోష్..’రిచ్’ మూవీ గ్రాండ్ లాంచ్!

Caption of Image.

ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, కో ప్రొడ్యూసర్ మహేంద్ర ఎస్ గైక్వాడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రిచ్’ (RICH).  యూత్‌ఫుల్ ‘ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’గా వస్తున్న ఈ లవ్ ఎంటర్‌టైనర్ లో  మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తు్న్నారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు రాజా నరేంద్ర తెరకెక్కిస్తున్నారు.

 బేబీ ఆరాధ్య, ఆదర్శ్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు సోమవారం ( సెప్టెంబర్ 28, 2026 ) హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు గోపీ మోహన్, దశరథ్, V. సముద్ర, G. రామ్ ప్రసాద్, డి.ఎస్. రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నేటి తరం ప్రేక్షకులను, యూత్‌ను ఆకట్టుకునేలా ఒక భిన్నమైన ‘బస్తీ బాయ్ లవ్ స్టోరీ’గా ఈ చిత్రాన్ని మలుస్తున్నామని దర్శకుడు రాజా నరేంద్ర తెలిపారు.  ఈ కథలోని ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటమే కాకుండా, క్లైమాక్స్ ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని హీరో మోహిత్ అన్నారు. మాజీ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన స్వరాలు, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.

►ALSO READ | Taapsee Wedding Photos: తాప్సీ పెళ్లి ఫొటోలు మూడేళ్లైనా సీక్రెటే.. కారణం భర్తేనా?

 వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు పద్మనాభ రెడ్డి, మార్గం గోపి వెల్లడించారు. ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులో విడుదల చేసి, ఆ తర్వాత హిందీలోనూ డబ్ చేసి పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హీరోయిన్ శ్రీజిత ఘోష్, నటి పూజా కేంద్రే, దర్శకుడు దశరథ్, విక్రమ్ ఆదిత్య, జబర్దస్త్ అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి..

 

©️ VIL Media Pvt Ltd.