Reading Time: < 1 minute

మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి: డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయంలో జరిగిన ఆందోళనలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

పోలీసులపై చర్యలకు రిపోర్ట్‌ను స్పీకర్ ముందు ఉంచాలని DGPకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్ ఆదేశం మేరకే పోలీసులు వ్యవహరించి ఉంటే.. అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

మహిళా MLAలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్‌కు మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉందని హైకోర్టు గుర్తుచేసింది.

స్పీకర్ ఉత్తర్వులను మార్చేందుకు కారణాలు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఘటన అసెంబ్లీ బయట గానీ, గేటు దగ్గర జరిగి ఉంటే రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించండని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

©️ VIL Media Pvt Ltd.