Reading Time: < 1 minute

నల్గొండ జిల్లాలో MRO ఆఫీస్లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్ఐ

Caption of Image.

నల్గొండ: నల్గొండ జిల్లా నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ, ప్రైవేట్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఆర్ఐగా పనిచేస్తున్న రాళ్లబండి గోప రాజుతో పాటు, ఆయన దగ్గర ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యెదుళ్ల యాదగిరి అనే వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ రైతుకి చెందిన వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు RI గోప రాజు రూ. 15,000 లంచం డిమాండ్ చేశాడు.

బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పథకం ప్రకారం తనిఖీలు చేశారు. ప్రైవేట్ వ్యక్తి అయిన యాదగిరి ద్వారా రూ. 15,000 లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ నల్గొండ రేంజ్ టీం దాడి చేసి, ఆ డబ్బును స్వాధీనం చేసుకుంది.

లంచం తీసుకున్న ఆర్ఐ గోప రాజుతో పాటు, ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి యాదగిరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులనూ హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా ప్రభుత్వ శాఖల్లో అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.

©️ VIL Media Pvt Ltd.