Reading Time: < 1 minute

‘అనకాపల్లి’ సౌండ్ గట్టిగా వినిపించబోతోంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వి. వి. వినాయక్!

Caption of Image.

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడుతో కలిసి స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే అందించారు.. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన స్టార్ డైరెక్టర్లు వి.వి. వినాయక్, శివ నిర్వాణ, సాయి రాజేష్, మైత్రి రవి తదితరులు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ ఈ సినిమాతో పెద్ద హీరోగా ఎదుగుతాడని, తారక్ పొన్నప్ప ప్రతినాయకుడిగా అందరినీ భయపెడతాడని వినాయక్ ఆకాంక్షించారు. ‘రంగస్థలం’ తరహాలోనే అనకాపల్లి నేటివిటీతో ఎంతో డెప్త్ ఉన్న రూటెడ్ కథగా ఈ చిత్రం నిలుస్తుందని మైత్రి రవి ప్రశంసించారు. 

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ త్రినాథరావు నక్కిన రూపంలో ఇండస్ట్రీకి ఒక గొప్ప నటుడు దొరికాడని కొనియాడారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటుడిగానూ చూడబోతున్నామని ప్రశంసించారు.  ప్రతి పాత్ర మధ్య పోటీపోటీగా సాగే నటన ఆడియన్స్‌ను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

►ALSO READ | రష్మిక క్రేజ్‌కే సవాల్ విసురుతున్న కొత్త అందాల భామ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘న్యూ నేషనల్ క్రష్’ ఎవరంటే?

సరికొత్త ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఒక కల్ట్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని హీరో విక్రమ్ సహిదేవ్, నిర్మాత లగడపాటి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. దేవ్‌జండ్ సమకూర్చిన సంగీతం, ఇంద్రజ పవర్ ఫుల్ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్‌లో అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ ‘అనకాపల్లి’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సౌండ్ చేస్తుందో చూడాలి.
 

 

©️ VIL Media Pvt Ltd.