
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విరాట్‌కు దేశ, విదేశాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమ వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెలబ్రిటీ ప్రపంచంలో ఎంతోమంది అభిమానించే జంటల్లో విరాట్, అనుష్క కూడా ఒకరు. అయితే విరాట్ కోహ్లీకి టాలీవుడ్‌తోనూ ఓ ఆసక్తికరమైనసంబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. అదేంటంటే.. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓ ముద్దుగుమ్మకు విరాట్ కోహ్లీ బావ వరుస అవుతారు. అవును ఇది నిజమే.. ఆమె మరెవరో కాదు.. క్రేజీ బ్యూటీ రుహానీ శర్మ.. అనుష్క శర్మకు కజిన్.
అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా
రుహానీ శర్మ సినీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారానే ఆమె హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2018లో విడుదలైన ‘చిలసౌ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రుహానీ.. తొలి చిత్రంతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు సినిమాల్లో రుహానీ శర్మ నటించింది. విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది. సినిమాల పరంగా పెద్దగా జోరు లేకపోయినా.. తన నటనతో మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!
అయితే రుహానీ శర్మకు అనుకున్న స్థాయిలో వరుస అవకాశాలు దక్కకపోవడంతో కొంతకాలంగా సినిమాల్లో ఆమె సందడి తగ్గింది. ప్రస్తుతం మంచి కథ, పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన రుహానీ.. తాను అనుష్కకు కజిన్ అని, విరాట్ కోహ్లీ తనకు బావ అవుతారని తెలిపింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రుహానీ శర్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు.
సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.