
నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ల పరంగా మంచి జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు పోషించిన ‘బిర్యాని’ పాత్ర, అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు పాత్రతో పాటు కథలో ప్రస్తావనకు వచ్చే కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే.. ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ ఈ సినిమాలో నటించారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.
అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా
గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ స్వయంగా ‘ది ప్యారడైజ్’లో తాను నటిస్తున్నట్లు చెప్పినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో తనది కీలకమైన పాత్ర అని ఆయన చెప్పడం ఈ చర్చకు మరింత ఆసక్తిని జోడించింది. వైరల్ అవుతున్న వీడియోలో బాబు మోహన్ సినిమా కోసం తాను తొలిసారి ఫోటోషూట్‌లో పాల్గొన్న విషయాన్ని వెల్లడించారు. తన పాత్ర కోసం ఐదు రకాల గెటప్స్‌ను పరిశీలించాలని చిత్రబృందం అనుకుందని.. అయితే మొదటి గెటప్‌నే చూసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓకే చెప్పారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఎలాంటి గెటప్ వేసినా తన ముఖానికి సూట్ అవుతుందని సరదాగా అన్నారు బాబు మోహన్.. ది ప్యారడైజ్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా అప్పట్లో ధీమా వ్యక్తం చేసినట్లు ఆ వీడియోలో ఉంది.
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!
అయితే బాబు మోహన్ చెప్పిన ప్రకారం ఆయన ‘ది ప్యారడైజ్’ కోసం షూటింగ్‌లో పాల్గొంటే.. సినిమాలో ఆయన పాత్ర ఎక్కడ కనిపించిందనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. వైరల్ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. బాబు మోహన్‌కు సంబంధించిన సన్నివేశాలను చివరి ఎడిటింగ్‌లో తొలగించారా.? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన నటించిన పాత్రను సినిమాలో వేరే విధంగా ఉపయోగించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఆయన షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ.. లాస్ట్ వెర్షన్‌లో ఆ సన్నివేశాలు ఉండకపోవచ్చని చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మాత్రమే. బాబు మోహన్ నిజంగా సినిమాలో నటించారా? నటిస్తే ఆయన పాత్ర ఏమిటి? షూట్ చేసిన సన్నివేశాలను తొలగించారా? లేక వేరే కారణంతో ఆయన పాత్రను సినిమాలో చూపించలేదా? అనే విషయాలపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
సినిమా టైటిల్ ఇలా మార్చాల్సిందే.. స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి.. చివరకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.