Reading Time: 2 minutes
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు.. అద్భుత ఔషధ గుణాలు ఇవే!

ఆముదం చెట్టు ఆకులలో అద్భుతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ, నొప్పి నివారణ గుణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్, వయస్సు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి విశేషంగా సహాయపడతాయి. ఆముదం ఆకుపై గోరువెచ్చని ఆవనూనె పూసి మోకాళ్లపై కట్టి ఉంచితే నొప్పులు త్వరగా శమిస్తాయి. అలాగే చిన్న దెబ్బలకు ఈ ఆకు రసాన్ని, పెద్ద గాయాలకు ఆకు పేస్ట్‌లో కొబ్బరినూనె కలిపి రాస్తే గాయాలు త్వరగా మానుతాయి. పూర్తి ప్రయోజనాలేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లా్ల్సిందే..

మోకాళ్ల నొప్పులు,కీళ్ల వాపులకు ఉపశమనం:

వయస్సు పెరగడం లేదా ఆర్థరైటిస్ వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో ఆముదం ఆకు బాగా పనిచేస్తుంది.

వాడే విధానం: కడాయిలో 20 మి.లీ ఆవనూనె వేసి వేడి చేసి, కాస్త చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక పూర్తి ఆముదం ఆకును ఆ నూనెలో ముంచి, నొప్పి ఉన్న మోకాలిపై ఉంచి శుభ్రమైన తెల్లటి గుడ్డతో కట్టు కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వాపు, నొప్పులు క్రమంగా తగ్గుతాయి.

గాయాలు త్వరగా మానడానికి:

శరీరంపై అయ్యే చిన్న చిన్న దెబ్బలు, పెద్ద గాయాలను మాన్పడానికి ఈ ఆకులు తోడ్పడతాయి. చిన్న గాయాలైతే ఆకులను నలిపి రసాన్ని గాయంపై వేయవచ్చు. పెద్ద గాయాలైతే ఆముదం ఆకుల పేస్ట్‌ను కొబ్బరినూనెతో కలిపి రాస్తే గాయం త్వరగా మానుతుంది.

మానసిక ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర లభిస్తుంది:

ఆముదం ఆకులను చిన్న ముక్కలుగా చేసి కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. ఆకులోని సారం నూనెలోకి దిగిన తర్వాత దింపి చల్లారనివ్వాలి. ఈ నూనెను తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి సుఖనిద్ర పడుతుంది.

గౌట్ సమస్యకు నివారణ:

యూరిక్ యాసిడ్ అసమతుల్యత వల్ల వచ్చే గౌట్ సమస్యలో కాళ్ల బొటనవేలి వద్ద వాపు, నొప్పులు ఉంటాయి. ఆముదం ఆకుల పేస్ట్‌ను కొబ్బరినూనె లేదా ఆవనూనెతో మరిగించి, ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజుకు రెండుసార్లు రాస్తే వాపు, నొప్పులు తగ్గుతాయి.

అరికాళ్ల వాపుల నివారణ:

ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లలో వచ్చే వాపులను తగ్గించడానికి రాత్రి పడుకునే ముందు పాదాలను వేడి నీటితో కడిగి, ఈ ఆకులను పాదాల చుట్టూ ఉంచి గుడ్డతో కట్టుకోవాలి. ఈ సులభమైన సహజ చిట్కాలను పాటించడం ద్వారా కీళ్ల నొప్పులు, వాపుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..