
సినీ నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఆమె.. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే, సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుండటంతో ఆమె తరచూ నెటిజన్ల నుంచి విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆమె తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే చాలా మందిపై తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇచ్చారు. తాజాగా మరోసారి రేణు దేశాయ్ తనపై ట్రోల్ చేసే వారిపై ఫైర్ అయ్యారు.
అబ్బా..! ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ ఆమెకు వెళ్ళిపోయింది.. చాలా బాధ పడ్డా
ఇటీవల వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో వినిపించే భారీ డీజే శబ్దాలు, అర్ధరాత్రి వరకు కొనసాగే కార్యక్రమాలపై రేణు దేశాయ్ స్పందించారు. పండుగ పేరుతో పెద్ద శబ్దాలు చేయడం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. దేవుడి విగ్రహం ముందు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ అదే సమయంలో భారీ శబ్దాలతో అర్ధరాత్రి వరకు డ్యాన్సులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో రేణు దేశాయ్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలపై రేణు దేశాయ్ స్పందిస్తూ..
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!
తనను విమర్శించడం వరకు ఒక ఎత్తయితే, ఏకంగా పచ్చిబూతులు తిట్టడం, తన చావును కోరుకునే స్థాయికి కొందరు దిగజారిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సందర్భాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలను, పిచ్చి పిచ్చి కామెంట్స్ ను ఎదుర్కొన్నానని, అయితే చదువుకున్నామని చెప్పుకునే నేటి సమాజంలో కూడా ఒక వ్యక్తిని ముఖంమీదే చచ్చిపో అంటూ శపించే స్థాయిలో కామెంట్లు రావడం బాధాకరంగా ఉందని ఆమె అన్నారు. తాను ఎవరి మత విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నించడం కోసం ఈ కామెంట్స్ చేయలేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. డీజే శబ్దాల వల్ల ఇబ్బంది పడే చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి తరఫున తన అభిప్రాయాన్ని వెల్లడించానని ఆమె పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న వారిని ఉద్దేశించి కూడా రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి.?, ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి.? అనే సంస్కారం కుటుంబం నుంచే వస్తుందని, ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారికి వారి తల్లిదండ్రులు ఎలాంటి విలువలు నేర్పించారో ఆలోచిస్తేనే భయంగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరో పోస్ట్ కూడా షేర్ చేశారు రేణు. డీజే శబ్దాల వల్ల జరిగే నష్టం, అలాగే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని ఓ డాక్టర్ చెప్తున్నా వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రేణు దేశాయ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.