
హైదరాబాద్: డా. బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. బీకామ్ (తెలుగు మాధ్యమం), బీకామ్ (ఇంగ్లీష్ మీడియం), ఎం.కామ్ (ఇంగ్లీష్ మాధ్యమం), ఎం.ఏ. తెలుగు, ఎం.బి.ఏ. (ఇంగ్లీష్ మాధ్యమం) కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు పేర్కొన్నారు. దరఖాస్తు, నమోదు, ట్యూషన్ ఫీజు చెల్లింపు తదితర వివరాలు వెబ్ సైట్ లో పొందోచ్చని సూచించారు.
దేశ, విదేశాల్లో నివసించే ఎన్నారై అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పై కోర్సులలో చేరొచ్చని పేర్కొన్నారు. అడ్మిషన్ / ట్యూషన్ ఫీజును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇతర ఆన్‌లైన్ చెల్లింపు విధానాల ద్వారా చెల్లించవచ్చు అని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లేదా www.braou.ac.in, లేదా విశ్వవిద్యాలయ టోల్‌ఫ్రీ నెం. 18005990101 లేదా 040-23680222 / 333/ 555 లో సంప్రదించొచ్చని సూచించారు.
►ALSO READ | అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TGPSC పరీక్షల షెడ్యూల్ రిలీజ్