
హైదరాబాద్: సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రిపబ్లిక్ నెట్వర్క్ ఫౌండర్ అర్నబ్ గోస్వామి ఈ సదస్సులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లు భారత్కు కీలకమని, భారత్ అభివృద్ధికి జాతీయవాద స్పూర్తీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశం కోసం ఐక్యంగా ముందుకు సాగాలి కానీ… సీజేపీ చేస్తుందేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులపై దాడులు, అల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేసే వారిపై దాడులు ఎందుకని నిలదీశారు.
పోలీసులపై దాడులను ఉపేక్షించొద్దని, ‘చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారుల తీరును అర్నాబ్ తప్పుబట్టారు. స్పైడర్‌మ్యాన్ వేషాల్లో వచ్చి హంగామా, నిరసనల పేరుతో హింసకు పాల్పడటం కరెక్ట్ కాదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, తాను జాగ్రత్తగా మాట్లాడాలని అర్నాబ్ వ్యంగ్యంగా మాట్లాడారు.
ప్రింట్ మీడియా భవిష్యత్‌పై అర్నాబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ మీడియా వెంటిలేటర్‌పై ఉందని, అయినా ఒప్పుకోవడం లేదని ఆయన చెప్పారు. 2010ల నుంచే ప్రింట్ మీడియా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని, కోవిడ్‌తో ప్రింట్ మీడియా తీవ్రంగా దెబ్బతిన్నదని వివరించారు.
ప్రింట్ మీడియా పూర్తిగా అంతరించే పరిస్థితి రావొచ్చని, పేపర్ చేతికిచ్చినా.. చదివే వారు తగ్గిపోయారని చెప్పారు. ఎవరూ చదవకపోతే.. ‘విశ్వసనీయత’తో ఏం లాభమని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రింట్ కంటే డిజిటల్ కంటెంట్‌కే ఆదరణ పెరుగుతోందని తెలిపారు.
►ALSO READ | ఇవి కేవలం ఉప ఎన్నికలే: బెంగాల్ ఓటర్ల వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
అమెరికన్ టెక్ దిగ్గజాలపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కంటెంట్‌ను కావాలనే అణచివేస్తున్నారని, అక్టోబర్ 10 నుంచి ‘కట్ ద ఆల్గో’ ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పారు.
యూట్యూబ్, ఇన్‌స్టా, ట్విట్టర్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదని, అమెరికన్ మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలతో నేరుగా మీడియా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితులు రావాలని ఆయన ఆకాంక్షించారు. నష్టాలు వచ్చినా.. మీడియా స్వతంత్రత కోసం పోరాడతామని.. మీడియా–టెక్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఆధిపత్య పోరాటమని, AI ఇన్సిడెంటల్.. నేషనలిజం ఫండమెంటల్ అని అర్నాబ్ గోస్వామి చెప్పారు.