Reading Time: < 1 minute

ఏఐతో తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవచ్చా..? ఈ టెకీ ఏం చేశాడో చూడండి..!

Caption of Image.

తిరుమలలో దర్శనం, వసతి గదులు బుక్ చేసుకోవడానికి సామాన్యులు చాలా కష్టపడుతుంటారు. సొంతంగా బుకింగ్ చేసుకోలేనివారు దళారులను ఆశ్రయించి మోసపోయిన మోసపోతుంటారు. అయితే.. ఓ వ్యక్తి ఏఐ ఏజెంట్ సాయంతో తిరుమలలో రూమ్ బుకింగ్ కి ప్రయత్నించి దాదాపు బుక్ చేసినంత పని చేశాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టెక్ బై పవన్ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.వీడియోలో ‘చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా’తో రూమ్ బుకింగ్‌కు టెకీ ప్రయత్నించాడు ఓ టెకీ. టెకీ ఇచ్చిన ప్రాంప్ట్ తో యూజర్ లాగిన్ వివరాలతో టీటీడీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించింది ఏఐ ఏజెంట్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by pavan (@tech_by.pavan)

వసతి బుకింగ్ ప్రక్రియను దాదాపు చివరి దశ వరకు తీసుకెళ్లింది ఏఐ ఏజెంట్. రూమ్ బుకింగ్‌లో అవసరమైన ఆప్షన్లను స్వయంగా ఎంచుకొని.. పేమెంట్ దశకు కూడా చేరుకుంది. అయితే.. బ్యాంక్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అందుబాటులో లేకపోవడంతో బుకింగ్ పూర్తి చేయలేకపోయింది.

వైరల్ అయిన వీడియోపై స్పందించిన టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దర్శన టికెట్ లేకుండా వసతి బుకింగ్ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.