జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, కడుపులో పురుగులు ఖతం: బొప్పాయి గింజల్లో పాపైన్, కార్పైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కడుపులోని హానికరమైన పరాన్నజీవులను, నులిపురుగులను నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ కొద్దిమొత్తంలో ఈ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
కాలేయం సమర్థవంతంగా పనిచేస్తుంది: లివర్ సంబంధిత సమస్యలు లేదా లివర్ సిర్రోసిస్ తో బాధపడేవారికి బొప్పాయి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి కాలేయంలోని విష వ్యర్థాలను బయటకు పంపి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మూత్రపిండాల సంరక్షణ: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో బొప్పాయి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాల కణజాలం దెబ్బతినకుండా కాపాడటంతో పాటు, కిడ్నీలు సజావుగా పనిచేసేందుకు తోడ్పడతాయి.
బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం: బొప్పాయి గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి, బరువు తగ్గడానికి మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి.
బొప్పాయి గింజలను ఎలా ఉపయోగించాలి?: బొప్పాయి గింజలను శుభ్రంగా కడిగి, ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వాటిని పొడి చేసి ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు. రోజువారీగా తీసుకునే సలాడ్లు, స్మూతీలు, పండ్ల రసాలలో ఈ పొడిని చల్లుకుని తినవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పొడి కలిపి తాగవచ్చు. అయితే, బొప్పాయి గింజలు చేదుగా, కాస్త ఘాటుగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలని, ముఖ్యంగా గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.




