Reading Time: < 1 minute
Balakrishna Koratala Siva Movie Dual Role Father Son Twist

Balakrishna – Koratala Siva: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ పవర్ ఫుల్ లీక్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని రీతిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాకుండా, ఒకే ఫ్రేమ్‌లో తండ్రి – కొడుకు పాత్రల్లో బాలకృష్ణ స్వయంగా నటించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటంతో, కథ విషయంలో ఆయన ఎలాంటి రాజీ పడకుండా పక్కా ప్లాన్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేశారని చెబుతున్నారు.

సమాజంలోని బలమైన రాజకీయ అంశాలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగపూరితమైన ఫ్యామిలీ డ్రామాను ఈ చిత్రంలో ప్రధానంగా పొందుపరిచినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ పూర్తిగా సరికొత్త మేకోవర్‌తో అదిరిపోయే లుక్‌లోకి మారనున్నారని తెలుస్తుంది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ఆయన, సరికొత్త ఎనర్జీతో సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే పట్టాలెక్కనుందని తెలుస్తుంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలివేషన్లకు కొరటాల మార్క్ సందేశం, తండ్రీకొడుకుల సెంటిమెంట్ తోడైతే వెండితెరపై వసూళ్ల వర్షం కురవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.