
ఇబ్రహీంపట్నం, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన మస్కు సంతోష్ కుమార్(30) చౌదర్పల్లిలోని ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
సోమవారం తన స్వగ్రామం నుంచి బైక్పై స్కూల్కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నంలోని మార్చురీకి తరలించారు.