
కుటుంబ బంధాలు, ఆత్మీయత, మనుషుల మధ్య ఉండే అనుబంధాలను తెరపై చూపించే సినిమాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఇలాంటి అనుభూతినే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పొందారు. ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను చూసిన ఆయన.. ఆ సినిమా తన మనసును బాగా కదిలించిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు తనకు నిద్ర పట్టలేదని శివరాజ్ కుమార్ తెలిపారు. సినిమాలో కనిపించిన కుటుంబ భావోద్వేగాలు తన జీవితంలోని జ్ఞాపకాలను గుర్తు చేశాయని చెప్పారు. తన తల్లిదండ్రులతో పాటు తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంతో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని శివన్న చెప్పుకొచ్చారు.
“ఈ మధ్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చూశాను. సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు నిద్ర పట్టలేదు. అది నాకు నా తల్లిదండ్రులను, నా తమ్ముడిని, నా కుటుంబాన్ని గుర్తు చేసింది. అలా పడుకుని సినిమా గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇలాంటి సినిమా నేను కూడా ఎప్పుడో ఒకసారి చేయాలని కోరుకుంటున్నాను” అని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.
#Shivarajkumar: I watched #VishwanathAndSons recently. When I saw the film, I couldn’t sleep for an hour. It reminded me of my parents and my family. I was lying there, thinking about it, and I was in tears. I think some emotions.. I also wish to do a film like that someday.…
— Laxmi Kanth (@iammoviebuff007) September 26, 2026
తమ్ముడు జ్ఞాపకాలతో మరింత ఎమోషనల్..
శివరాజ్ కుమార్‌కు పునీత్ రాజ్‌కుమార్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు.. ఎంతో ఆత్మీయమైన కుటుంబ సభ్యుడు. కన్నడ సినీ పరిశ్రమలో ‘అప్పు’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ 2021లో 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తమ్ముడు పునీత్‌ను చిన్న వయసులోనే కోల్పోవడం శివన్న జీవితంలో తీవ్ర విషాదంగా మిగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం, బంధాల విలువను చూపించే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూడటంతో పునీత్ జ్ఞాపకాలు కూడా ఆయనకు గుర్తొచ్చినట్లు శివరాజ్ కుమార్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
►ALSO READ | రష్మిక క్రేజ్‌కే సవాల్ విసురుతున్న కొత్త అందాల భామ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘న్యూ నేషనల్ క్రష్’ ఎవరంటే?
అందుకే సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం నుంచి బయటపడలేక కొంతసేపు అలాగే ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తోంది. తన తండ్రి, దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో పాటు తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ జ్ఞాపకాలు కూడా ఈ సినిమా ద్వారా శివన్నను వెంటాడినట్లు ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి.
థియేటర్లలో సక్సెస్.. ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్..
కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో మంచి ఆదరణ అందుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది.
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఓటీటీ ద్వారా ఇతర భాషల సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే శివరాజ్ కుమార్ సినిమా చూసి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన విషయం ఇప్పుడు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు.. తనను ఇంతగా కదిలించిన తరహా కుటుంబ కథలో తాను కూడా ఎప్పుడో ఒకరోజు సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు శివన్న చెప్పడం ఈ సినిమాపై ఆయనకు కలిగిన ప్రత్యేకమైన అనుభూతిని తెలియజేస్తోంది.