
కొల్హాపూర్: రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో.. జీవితాలను క్షణాల్లోనే ఎలా చిదిమేస్తాయో మరోసారి రుజువు చేసిన ఘటన ఇది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఘోరం జరిగింది. పెత్వడ్గావ్-హత్కనంగలే రహదారిపై దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. అతివేగంగా వస్తున్న ఎర్టిగా కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది.
⚠️ CCTV | Kolhapur, Maharashtra
A speeding car lost control on a curve near Minche village and hit a two-wheeler carrying a couple. The rider died on the spot. His wife is critically injured.
Police have registered a case for reckless driving.
Slow down on curves. 🙏… pic.twitter.com/i4hvRy3lY5
— Abhishek Jalan (@AbhishekJalan26) September 28, 2026
ఈ ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న HDFC బ్యాంక్ ఉద్యోగి స్పాట్ లోనే చనిపోయాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన బ్యాంక్ అధికారిని దీపక్ రావుసాహెబ్ షిండే (వయస్సు 45, మిరాజ్, సాంగ్లీ జిల్లా నివాసి)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో అతని భార్య అశారాణి అలియాస్ అశాదేవి దీపక్ షిండే (వయస్సు 40) తీవ్రంగా గాయపడటంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ షిండే సాంగ్లీలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో బ్రాంచ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆదివారం తన భార్యతో కలిసి కొల్హాపూర్ జిల్లాలోని వాద్గావ్‌లోని హనుమాన్ రోడ్ ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న తన బంధువును పరామర్శించడానికి వెళ్లాడు. ఆదివారం రాత్రి బంధువుల ఇంట్లోనే భార్యాభర్తలు ఉన్నారు. సోమవారం ఉదయం 7:30 నుంచి 8:00 గంటల మధ్య భార్యాభర్తలు తమ ఎంహెచ్10 బిఎల్ 1661 మోటార్‌సైకిల్‌పై తిరిగి మిరాజ్ వైపు బయలుదేరారు.
►ALSO READ | దేశంలో జనాభా పెరుగుతుంటే.. ఓటర్లు ఎట్లా తగ్గుతరు: సర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
భార్యాభర్తలు బైక్పై మించే అనే గ్రామానికి దగ్గరలో ఉండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న ఎర్టిగా కారు డ్రైవర్ సాహిల్ రాజు ఫజల్ (ఆర్. యాదవ్), తన కారును నేరుగా రోడ్డుకు అవతలి వైపుకు తీసుకు వెళ్లి షిండే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ ధాటికి ద్విచక్ర వాహనంపై ఉన్న భార్యాభర్తలు ఫుట్‌బాల్‌లా గాలిలోకి ఎగిరి, రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి చాలా దూరం ఎగిరిపడ్డారు. దాదాపు 15 అడుగుల దూరంలో పడిపోయారు.
ఈ ప్రమాదంలో దీపక్ షిండే ఛాతీ, కడుపు భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. ఈ హృదయవిదారకమైన ఘటన మొత్తం రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు.