Reading Time: < 1 minute

OTT Telugu Thriller: భార్య మిస్సింగ్ మిస్టరీ.. OTTలోకి వరుణ్ సందేశ్, శ్వేతా బసు మూవీ

Caption of Image.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు, మర్డర్ మిస్టరీలు, ఊహించని ట్విస్టులతో సాగే కథలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అదే ‘నా వైఫ్ మిస్సింగ్’ (Naa Wife Missing).

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్ లో ఈ సిరీస్ వస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటించారు. ‘కొత్త బంగారు లోకం’ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై జోడీగా కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

కథ విషయానికి వస్తే, వరుణ్ సందేశ్ ఇందులో బాలు అలియాస్ బాల సుబ్రహ్మణ్యం అనే గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పాత్రలో కనిపించనున్నాడు. తన భార్య కనిపించడం లేదంటూ అతడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే ఆమె నిజంగానే కనిపించకుండా పోయిందా? అసలు ఆమె ఎక్కడికి వెళ్లింది? ఆమె మిస్సింగ్ వెనుక కారణమేంటి? ఈ కేసులో భర్తకు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నల చుట్టూ కథలో సస్పెన్స్ కొనసాగనున్నట్లు టీజర్ ద్వారా  తెలుస్తోంది. మిస్సింగ్ కేసుతో పాటు మిస్టరీ, ఎమోషన్, సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు.

స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై శివ కాంతనేని, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేట్రికల్ రిలీజ్‌కు బదులుగా ‘ఆహా’ వేదికగా ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్–శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మిస్సింగ్ మిస్టరీ ప్రేక్షకులను ఎంతవరకు థ్రిల్ చేస్తుందో చూడాలి.

ALSO READ: యూత్ అండ్ ఫ్యామిలీ టార్గెట్‌గా ‘321’..

©️ VIL Media Pvt Ltd.