Reading Time: 2 minutes

రోహిత్ శర్మ ఔటవ్వగానే ఫ్యాన్స్ సంబరాలు: ద్రవిడ్, జడేజాలకు కూడా ఇదే అనుభవం!

Caption of Image.

Virat Kohli Fans Erupt: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుత శతకాలతో చెలరేగడంతో విండీస్ నిర్దేశించిన 296 రన్స్ టార్గెట్ ని ఇండియా ఈజీగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (32 పరుగులు) అవుట్ అయిన సమయంలో స్టేడియంలో చోటు చేసుకున్న ఒక పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రోహిత్ శర్మ వికెట్ పడగానే ఫ్యాన్స్ సంబరాలు: 

రోహిత్ శర్మ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో, స్టేడియంలో ఉన్న కొందరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. కేరళలో రోహిత్ శర్మకు భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, అతడు ఔట్ కాగానే అభిమానులు అరవడం చర్చకు దారితీసింది. కానీ రోహిత్ ఔట్ అయినందుకు వారు సంతోషపడనప్పటికీ, అనంతరం క్రీజులోకి వచ్చే విరాట్ కోహ్లీని స్వాగతించేందుకే అభిమానులు అలా కేకలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అనుకున్నట్లుగానే క్రీజులోకి వచ్చిన కోహ్లీ 139 పరుగులతో చెలరేగాడు. 

రాహుల్ ద్రావిడ్‌కూ ఇదే పరిస్థితి: 

భారత జట్టులో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న తొలి ఆటగాడు రాహుల్ ద్రవిడ్. టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ద్రవిడ్ ఔట్ కాగానే, నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్ క్రీజులోకి వస్తాడనే ఆనందంతో అభిమానులు తెగ సంబరాలు చేసుకునేవాళ్ళు.. తాను ఔట్ కావాలనే సొంత దేశపు ఫ్యాన్సే కోరుకోవడం తనను ఎంతగానో బాధించింది.. సచిన్ ఎరాలో ఆడడంతో నా బ్యాటింగ్‌ను ఫ్యాన్స్ పూర్తిగా ఆస్వాదించలేకపోయానని ద్రవిడ్ గతంలో ఎమోషనల్ కూడా అయ్యారు.

ALSO READ : బస్ దిగుతూ జారిపడిన రోహిత్ శర్మ..

ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా అనుభవం: 

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఘటనలు అనేకాసార్లు జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడే సమయంలో రవీంద్ర జడేజా ఔట్ కాగానే, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడనే ఉత్సాహంతో సీఎస్‌కే ఫ్యాన్స్ జడేజా వికెట్ పడాలని బలంగా కోరుకునేవారు. జడ్డూ ఔట్ అయిన ప్రతిసారీ స్టేడియం దద్దరిల్లేలా సెలబ్రేట్ చేసుకునేవారు. ఈ విషయంపై జడేజా కూడా పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు, కానీ ఫ్యాన్స్ మైండ్ సెట్ మాత్రం ఇప్పటికీ మారలేదు. 

©️ VIL Media Pvt Ltd.