Reading Time: < 1 minute

2029లో రాహుల్ గాంధే విజయ్‎ను ప్రధాని సీటులో కూర్చొబెడ్తరు.. టీవీకే లేడీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Caption of Image.

చెన్నై: 2029లో విజయ్ ప్రధాని అభ్యర్థి అంశంపై కాంగ్రెస్, టీవీకే నేతల మధ్య మాటల యుద్ధం జరగుతోంది. ఈ క్రమంలో టీవీకే మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ హాట్ కామెంట్స్ చేశారు. 2029లో విజయ్ దేశ ప్రధాని అవుతారని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధే విజయ్‎ను చేయి పట్టుకుని తీసుకెళ్లి మరీ పీఎం సీటులో కూర్చొబెడుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చి విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేశాడు. అదేవిధంగా 2029లో కూడా ఆయనే విజయ్‎ను దేశ ప్రధానిని చేస్తాడు. రాహుల్ విజయ్ చేయి పట్టుకుని తీసుకెళ్లి మరీ ప్రధాని కుర్చీలో కూర్చొబెడతాడు’’ అంటూ కనిమొళి కామెంట్స్ చేశారు. కనిమొళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

ఇటీవల ఇండియా టుడే – సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ 9.2 శాతం ఓట్లతో తదుపరి భారత ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రస్తుత ప్రధాని మోడీ తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సెకండ్ ప్లేస్‎లో నిలిచారు. 

►ALSO READ | సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం: రైతులు, ఉపాధ్యాయులపై కేసులన్నీ ఎత్తివేత

అయితే, తదుపరి భారత ప్రధాని అభ్యర్థిగా విజయ్‎ను ప్రొజెక్ట్ చేయడంపై తమిళనాడు కాంగ్రెస్ భగ్గుమంటోంది. విజయ్‎ను పీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 

ఈ ఇష్యూపై కాంగ్రెస్, టీవీకే నేతల మధ్య డైలాగ్ వారు నడుస్తోన్న తరుణంలో.. 2029లో విజయ్ ప్రధాని అవుతారని.. రాహుల్ గాంధే విజయ్ ను పీఎం సీటులో కూర్చొబెడతారని ఎమ్మెల్యే  కనిమొళి సంతోష్ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. కనిమొళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరీ. 
 

©️ VIL Media Pvt Ltd.