
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చించే శుభవార్త వచ్చేసింది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ ‘OG’ యూనివర్స్ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను అందించారు . ఈ రోజు ( సెప్టెంబర్ 2, 2026 ) పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు కోసం ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. పవర్ స్టార్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన’OG’ కి సీక్వెల్ ను ప్రకటించారు.
OG యూనివర్స్…
పవన్ కళ్యాణ్ బర్త్‌డే కానుకగా డైరెక్టర్ సుజీత్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సుజీత్, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగే క్రేజీ ‘OG యూనివర్స్’ బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్ చూపించారు. ఈ వీడియోలో థమన్ మాట్లాడుతూ.. ‘OG సీక్వెల్ భారతదేశంలోనే సాగుతుంది, కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎమోషన్స్, వెస్ట్రన్ మేకింగ్ శైలి కలగలిసి ఒక పవర్‌ఫుల్ విజన్‌గా ఉండబోతోంది’ అని వెల్లడించారు.
మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..
డిస్కషన్ మధ్యలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ…. “ఈ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్ , ఆనాటి ఐఎన్ఏ (INA) కనెక్షన్ జోడించడానికి అద్భుతమైన స్కోప్ ఉంది. వి ఆర్ గివింగ్ అవర్ బెస్ట్” అని చెప్పడంతో ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దీనికి తోడు వీడియో చివర్లో చూపించిన కొన్ని ఎనిమేటెడ్ విజువల్స్, నెక్స్ట్ పార్ట్స్‌లో రాబోయే భయంకరమైన సామురాయ్ (Samurai) కత్తిసాము సీన్లు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి..
షూటింగ్ ఎప్పుడంటే?
పవన్ కళ్యాణ్ కోసం థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్ హిస్టరీ, జపనీస్ సామురాయ్ కల్చర్, పవన్ కళ్యాణ్ మార్క్ స్వగ్ మేళవింపుతో రాబోతున్న ఈ విజువల్ వండర్ ‘OG 2’ వచ్చే ఏడాది (2027) సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో వచ్చిన ఈ వీడియోతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు..
From the #OGUniverse
To the #OG…ALL LOVE for everything so far…
And everything that begins from here 🙂 🧿🧿♥️♥️Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
— Sujeeth (@Sujeethsign) September 2, 2026