Reading Time: 2 minutes
Sunil : నా ఫస్ట్ క్రష్ తనే.. ప్రపోజ్ చేయడానికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చా.. తొలి ప్రేమ గురించి చెప్పిన సునీల్..

టాలీవుడ్ నటుడు సునీల్ హీరోగా, హాస్య నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ.. తన తొలి ప్రేమ అనుభవం, కమెడియన్‌గా స్థిరపడిన తర్వాత కొనుగోలు చేసిన మొదటి కారు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలను ఆయన వివరంగా తెలియజేశారు. సునీల్‌ని తన తొలి క్రష్ గురించి మట్లాడుతూ తన క్రష్ పేరు చెప్పడానికి సునీల్ నిరాకరిస్తూ, “ఇప్పుడు ఆమెకు పిల్లలు ఉండి ఉంటారు, నాన్న అని వచ్చేస్తారు” అని నవ్వించారు. ఈ సంఘటన భీమవరంలో కాలేజీలో చదువుతున్న రోజుల్లో జరిగిందని గుర్తు చేసుకున్నారు. తన తొలి క్రష్ మనసు మమత సినిమాలో నటి సీతార గారిలా కనిపించేదని వివరించారు. ఆ అమ్మాయిని చూడగానే, “ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి” అనే ఆలోచన తన మనసులో మెరిసిందని, మొదట ఆమెకు ఒక గ్రీటింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

న్యూ ఇయర్‌కి ఆ అమ్మాయికి గ్రీటింగ్ ఇవ్వాలని సునీల్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. మంచి లవ్ గ్రీటింగ్ కార్డ్ కొనుగోలు చేసి, దానిలోని మ్యూజిక్ చిప్‌ను తనకు అనుకూలంగా మార్చమని స్నేహితులను కోరారు. ఆ గ్రీటింగ్ ఓపెన్ చేస్తే మ్యూజిక్ వస్తుందని, క్లోజ్ చేస్తే ఆగిపోతుందని స్నేహితులు వివరించారు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ గ్రీటింగ్ కార్డ్‌ను ఆ అమ్మాయికి ఇచ్చి, “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పారట. అయితే, గ్రీటింగ్ ఓపెన్ చేయగానే, దానిలో నుంచి “మెర్రీ క్రిస్మస్” అనే పాట వచ్చిందని సునీల్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఆమెతో పాటు అక్కడున్నవారు కూడా సునీల్ గురించి తేడాగా ఆలోచించారని, “ఇతను కొంచెం తేడా” అనే భావన వారికి కలిగిందని సరదాగా చెప్పారు. ఈ సంఘటన తన తొలి ప్రేమ ప్రయత్నానికి పుల్‌స్టాప్ పెట్టిందని సునీల్ నవ్వుతూ వివరించారు.

ఆ తర్వాత, సునీల్ గొప్ప కమెడియన్ అయిన తర్వాత తన మొదటి వాహనం గురించి కూడా పంచుకున్నారు. తన మొదటి కారు హ్యుందాయ్ యాక్సెంట్ టోర్నడో అని తెలిపారు. మొదట తాను ఐ10 కారు కొందామని అనుకున్నానని, ఈ విషయాన్ని దర్శకుడు రవికిషోర్ గారికి చెప్పానని సునీల్ చెప్పారు. రవికిషోర్ గారు వెంటనే, “నీ పర్సనాలిటీయే పెద్దది. పైగా నువ్వు ముందు కూర్చుంటే నీ కాళ్లు పట్టాలి. ఐ10లో నువ్వు ఎలా సరిపోతావు అనుకుంటున్నావు? పైగా నీకు లగేజ్ ఎక్కువ ఉంటుంది, ఐస్ బాక్స్ అంటావ్, ఇయ్యి అంటావ్, వెనకాల డిక్కీ అయినా ఉండాలి కదా?” అని సలహా ఇచ్చారట. ఈయన ఒక సీఏ కాబట్టి సరిగ్గా చెప్పారు అనిపించి, రవికిషోర్ గారి సలహాను పాటించి హ్యుందాయ్ యాక్సెంట్ టోర్నడో కారును కొనుగోలు చేశానని సునీల్ వివరించారు. ఆ కారు నంబర్ 6 అని, అది పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో కూడా కనిపించిందని సునీల్ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..