Reading Time: 2 minutes
Asus Pad T3201 India Launch On August 6 12 2 Inch 2 8k 144hz Oled Display Dimensity 8300 9000mah Battery

ASUS కంపెనీ నుండి కొత్తగా ASUS Pad (T3201) ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్‌లో ఆగస్టు 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో పరిచయం చేసిన ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ డివైస్‌ను మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది.

స్లిమ్ డిజైన్:

ASUS Pad (T3201) కేవలం 6.5mm మందం మాత్రమే ఉండగా, బరువు 523 గ్రాములు. ఫైబర్‌గ్లాస్ రియర్ ప్యానెల్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ ప్రయాణాల్లో లేదా ఆఫీస్ పనుల కోసం సులభంగా తీసుకెళ్లేలా డిజైన్ చేశారు. ట్యాబ్లెట్‌తో పాటు ప్రొటెక్టివ్ ఫోలియో కేసును కూడా ASUS అందిస్తోంది. ఇది స్క్రాచ్‌లు, చిన్నపాటి డ్యామేజ్‌ల నుంచి రక్షణ కల్పించడంతో పాటు నాలుగు రకాల స్టాండ్ యాంగిల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

12.2 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే:

ఈ ట్యాబ్లెట్‌లో 12.2 అంగుళాల డ్యూయల్ లేయర్ OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2800×1840 పిక్సెల్స్ (2.8K) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 3:2 ఆస్పెక్ట్ రేషియో మరియు 92% స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంటుంది. 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ ఉండటంతో కలర్స్ మరింత సహజంగా కనిపిస్తాయి. డిస్‌ప్లే సాధారణంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్, HDR కంటెంట్ కోసం 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే TÜV Low Flicker మరియు Low Blue Light సర్టిఫికేషన్లు ఉండటంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

డాల్బీ అట్మాస్‌తో క్వాడ్ స్పీకర్లు:

ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ASUS ఈ ట్యాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్ సెటప్తో పాటు డాల్బీ అట్మాస్ 360° సినిమాటిక్ సౌండ్ సపోర్ట్‌ను అందించింది. సినిమాలు, మ్యూజిక్, గేమింగ్ సమయంలో స్పష్టమైన ఇంకా ఇమ్మర్సివ్ సౌండ్ అనుభవాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

డైమెన్సిటీ 8300 ప్రాసెసర్:

పనితీరు విషయానికి వస్తే.. ఈ ట్యాబ్లెట్‌లో MediaTek Dimensity 8300 ఆక్టా-కోర్ 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.35GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. దీనికి 8GB LPDDR5X ర్యామ్ ను అందించారు. యాప్స్ మధ్య వేగవంతమైన మల్టీటాస్కింగ్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు.

9000mAh బ్యాటరీ:

ఈ ట్యాబ్లెట్‌లో 9000mAh లిథియం-పాలిమర్ బ్యాటరీను అందించారు. బాక్స్‌లోనే 45W USB-C ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఛార్జర్‌తో ట్యాబ్లెట్‌ను 30 నిమిషాల్లో 0 నుంచి 50% వరకు ఛార్జ్ చేయవచ్చు.

ధర:

ASUS Pad (T3201) భారత మార్కెట్‌లో ఆగస్టు 6న అధికారికంగా విడుదల కానుంది. ఈ ట్యాబ్లెట్ ఫ్లిప్‌కార్ట్, ASUS ఈ-షాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ASUS, ROG స్టోర్లు, ఇతర రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే వివిధ స్టోరేజ్ వేరియంట్ల ధరలను కంపెనీ లాంచ్ తేదీ నాటికి ప్రకటించనుంది.