July 19, 2026

సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం.. భారీ భద్రతతో ఆసుపత్రికి తరలింపు

సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం.. భారీ భద్రతతో ఆసుపత్రికి తరలింపు
Reading Time: < 1 minute

సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం.. భారీ భద్రతతో ఆసుపత్రికి తరలింపు

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహర దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం (జులై 18) తెల్లవారుజూమున జంతర్ మంతర్‎లోని దీక్ష శిబరం నుంచి పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అయితే, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

కాగా నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణ వేత, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

 శనివారానికి (జులై 118) ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయన దీక్ష ఇలాగే కొనసాగిస్తే చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. 

 

©️ VIL Media Pvt Ltd.