July 19, 2026

ప్రతి ఏడుగురిలో ఒకరికి ఇదే సమస్య.. మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ప్రతి ఏడుగురిలో ఒకరికి ఇదే సమస్య.. మీలో  ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Reading Time: 2 minutes

ప్రతి ఏడుగురిలో ఒకరికి ఇదే సమస్య.. మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Caption of Image.

జీవితంలో ఎప్పుడైనా, ఎవరికైనా ఓటములు ఎదురుకావడం సహజం. అయితే, ఆ ఓటమిని తట్టుకుని నిలబడినవాడే తిరిగి విజయం సాధిస్తాడు. అలా కాకుండా, మానసిక బలాన్ని కోల్పోతే మాత్రం మనిషి  డిప్రెషన్‌లోకి జారుకుని, చివరికి ప్రాణాలు తీసుకునేంతటి తీవ్ర నిర్ణయాలకు వెళ్తుంటాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీనివల్ల చాలామంది ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారు.

చాలామంది భయాన్ని (యాంగ్జైటీని) గుర్తించగలుగుతున్నారు కానీ, లోలోపల పెరిగిపోతున్న తీవ్రమైన ఒత్తిడిని (స్ట్రెస్‌ను) గుర్తించలేకపోతున్నారు. మరి మనలో మానసిక ఒత్తిడి పెరుగుతోందని చెప్పే ఆ లక్షణాలు ఏంటో, దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దామా…

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ?  
అతిగా ఆలోచించడం: నా జీవితం ఎందుకిలా అయిపోయింది? అని ఎప్పుడూ నిరాశతో, నెగిటివ్‌గా ఆలోచించడం.

నిద్రలేమి సమస్యలు: రాత్రి ఎంతకీ నిద్రపట్టకపోవడం, ఉదయాన్నే మంచం దిగాలనిపించకపోవడం.

పనిపై ఇష్టం లేకపోవడం: గతంలో చకచకా పనులు చేసుకునేవారు కూడా.. ఒత్తిడి వల్ల ఇప్పుడు ఏ పని చేయడానికైనా భయపడటం, అసలు పని మొదలుపెట్టడానికే వెనకడుగు వేయడం.

చిరాకు, అసహనం: అంతకుముందు అందరితో కలిసిమెలిసి తిరిగినవారే.. ఇప్పుడు ఎవరైనా పలకరిస్తే విసుక్కోవడం, చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోవడం.

ఆత్మవిశ్వాసం తగ్గడం: నేను ఈ పని సరిగ్గా చేయలేనేమో అని తనను తాను అనుమానించుకోవడం. పుస్తకమో, ఫోనో చేతిలో ఉన్నా మనసంతా ఎక్కడో తిరుగుతుండటం వల్ల దేనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం.

ఒత్తిడి నుండి బయటపడటం ఎలా?  
ఒకేసారి అన్ని పనులు నెత్తిన వేసుకోకుండా, మీ అవసరాన్ని బట్టి పనులను చిన్న భాగాలుగా విభజించుకోండి. ముఖ్యమైన లేదా కష్టమైన పనిని మొదట పూర్తి చేస్తే.. అది మీకు తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్‌తో మిగతా పనులను సులువుగా చేయగలుగుతారు. చేసే ఏ పనైనా ఇష్టపడి, ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోండి.

మంచి పుస్తకాలు : ఖాళీ సమయాల్లో మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆలోచనా విధానాన్ని మార్చడమే కాకుండా జ్ఞాపకశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

సోషల్ మీడియాకు దూరం: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇతరుల స్టేటస్‌లు, పోస్ట్‌లు చూసి మనల్ని మనం తక్కువగా ఊహించుకుని డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోజులో ఫోన్ చూసే సమయాన్ని బాగా తగ్గించండి.

కుటుంబంతో గడపండి: ఫోన్లకు ఇచ్చే సమయాన్ని మీ కుటుంబ సభ్యులకు, మీకున్న మంచి  హాబీస్ కి  కేటాయించండి. సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల ఒత్తిడి సగం తగ్గిపోతుంది.
 

©️ VIL Media Pvt Ltd.