July 19, 2026

Reba Monica Baby Bump: బేబీ బంప్‌తో రెబా మోనికా స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Reba Monica Baby Bump: బేబీ బంప్‌తో రెబా మోనికా స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటోలు
Reading Time: 2 minutes

Reba Monica Baby Bump: బేబీ బంప్‌తో రెబా మోనికా స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Caption of Image.

‘సామజవరగమన’ మూవీతో తెలుగు ఆడియన్స్‌ మనసులు దోచేసింది మలయాళ బ్యూటీ రెబా మోనికా జాన్. తనదైన నటనతో, క్యూట్ లుక్స్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక మధురమైన వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2022లో తన లాంగ్‌ టైమ్ బాయ్‌ఫ్రెండ్ జోమోన్ జోసెఫ్‌ను పెళ్లాడిన రెబా, త్వరలోనే తల్లి కాబోతోంది.

లేటెస్ట్గా ఈ బ్యూటీ తన బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. థాయిలాండ్‌లోని ఫుకెట్ బీచ్ రిసార్ట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ నటి, అక్కడ దిగిన కొన్ని స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. రెడ్ కలర్ ప్రింటెడ్ మ్యాక్సీ డ్రెస్‌లో, బీచ్ ఒడ్డున ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న రెబా స్టన్నింగ్ లుక్స్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

రెబా మోనికా జాన్ ఎమోషనల్ పోస్ట్..

తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన రెబా మోనికా జాన్.. ‘సమయం ఇంత వేగంగా ఎలా గడిచిపోయింది? బేబీ బంప్‌తో గడిపే చివరి కొన్ని రోజులు ఇవి’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. త్వరలో తల్లి కాబోతున్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు ‘కంగ్రాట్స్ బ్యూటీ’ అంటూ హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రెబా మోనికా జాన్ సినిమాలు.. 

‘సామజవరగమన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  రెబా మోనికా జాన్.. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలోని ‘స్వాతి రెడ్డి’ పాటతో అలరించింది. ఇటీవలే శ్రీవిష్ణుకి జోడీగా ‘మృత్యుంజ‌‌య్‌‌’ సినిమాలో నటించి మెప్పించింది. ఇందులో ఐపీఎస్ సీతా ప‌‌రశురామ్‌‌గా రెబా మెనికా జాన్ కనిపించి ఆకట్టుకుంది. తమిళంలో ‘బిగిల్’, ‘ఎఫ్‌ఐఆర్’, ‘కూలీ’, మలయాళంలో ‘ఫోరెన్సిక్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన క్యూట్ లుక్స్‌తో పాటు నటనతో సౌత్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JOE (@joemonjoseph)

©️ VIL Media Pvt Ltd.