Reading Time: < 1 minute

కేజ్రీవాల్‎కు వాస్తు ఎఫెక్ట్ పడిందా.. ఇల్లు మారిన రోజునే పార్టీ ఖతం..!

Caption of Image.

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ ఎదురు దెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజయ్ పాఠక్, స్వాతి మలివాల్ వంటి కీలక నేతలు పార్టీని వీడారు. అయితే.. కేజ్రీవాల్ ఢిల్లీలో కొత్త ఇంట్లోకి మారిన రోజే ఆసక్తికరంగా ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

న్యూఢిల్లీలోని 95, లోధి ఎస్టేట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించిన ప్రభుత్వ నివాసంలోకి శుక్రవారం (ఏప్రిల్ 24) ఫ్యామిలీతో సహా కేజ్రీవాల్ షిప్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆప్ కూడా ధృవీకరించింది. అయితే, కేజ్రీవాల్ ఇళ్లు మారిన రోజే ఆశ్చర్యకరంగా ఆప్ ఎంపీలు బీజేపీలోకి జంప్ కావడాన్ని లింక్ పెడుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

►ALSO READ | చద్దా షాకిస్తే.. మిట్టల్ షేక్ చేశాడు.. రాజ్యసభలో ఆప్ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేసిన కేజ్రీవాల్ నమ్మిన బంటు !

కేజ్రీవాల్ కొత్త ఇంటి వాస్తు బాగోలేదని.. ఆ ఇంట్లోకి షిప్ట్ అయిన తొలి రోజే రాజ్య సభలో ఆప్ దాదాపు ఖాళీ అయ్యిందని సరదాగా వ్యానిస్తున్నారు. కేజ్రీవాల్ వీలైనంత త్వరగా ఆ ఇళ్లు మారడం బెటర్.. అదే ఇంట్లో ఉంటే మొత్తం పార్టీనే నామారూపాల్లేకుండా పోతుందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. సర్.. మరోసారి ఇంటి వాస్తు చెక్ చేసుకోండని మరో నెటిజన్ సూచించాడు. కేజ్రీవాల్ ఇళ్లు ఛేంజ్ కావడం అదే రోజు ఆప్ ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడంతో ఇళ్లు వాస్తు అంశంపై హాట్ టాపిక్‎గా మారింది. 

©️ VIL Media Pvt Ltd.