Reading Time: < 1 minute
Gurugram Shocker Radiologist Kills Nurse Wife With Lethal Injection Over Dowry

Man Kills Wife: కట్టుకున్న వాడే కసాయిగా మారాడు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే భార్యను దారుణంగా హత్య చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి, తన భార్యను కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. రేడియాలజిస్ట్ అయిన అరుణ్ శర్మ, నర్సుగా పనిచేస్తు్న కాజల్ గురుగ్రామ్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో కలిశారు, ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గత నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలకే ఈ ప్రేమ పెళ్లి విషాదంగా మారింది. అరుణ్ తన భార్యను హత్య చేశాడు.

Read Also: Sadashiv Pradhani: కుమార్తెకు వేరే కులానికి చెందిన వ్యక్తితో ఎంగేజ్మెంట్.. మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబాన్ని వెలివేత

వివాహం జరిగిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై శారీరక దాడులకు పాల్పడినట్లు కాజల్ సోదరుడు ఆరోపించారు. డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ, కట్నం విషయంలో ఆమెను వేధించినట్లు చెప్పారు. హోలీ పండగ రోజు మార్చి4న గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ పుట్టింటికి అరుణ్ వచ్చాడు. దీని తర్వాత రెండు వారాలకే అంటే మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్, కాజల్‌పై దాడికి పాల్పడ్డాడు.

తర్వాతి రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అరుణ్, కాజల్‌తో మాట్లాడటానికి కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కొద్ది సమయం తర్వాత కాజల్ ముక్కు నుంచి రక్తం కారుతూ కనిపించింది. కుటుంబీకులు ఆస్పత్రి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. టాయిలెట్లో ఒక సిరంజి దొరికిందని, అరుణ్ ఆమెకు విషం ఇంజెక్షన్ ఇచ్చి ఉంటాడని కుటుంబీకులు అనుమానించారు. పోలీస్ విచారణలో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానే హత్య చేసినట్లు అరుణ్ ఒప్పుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ ‌లో అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌కు బానిసైన చరిత్ర ఉందని అనుమానిస్తున్నారు.