Reading Time: < 1 minute
India Fuel Crisis Russian Crude Us Lpg Mangalore Port Arrival

India Fuel Crisis: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, భారత్‌కు గుడ్ న్యూస్ వచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల భారత్ ఇంధన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎల్పీజీపై ప్రజల్లో భయాలు పెరిగాయి, మరోవైపు పెట్రోల్, డీజిల్ కోసం ప్రజల్లో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో రష్యా నుండి ముడి చమురుతో నిండిన ‘ఆక్వా టైటాన్’, అమెరికా నుండి ఎల్‌పిజిని తీసుకువస్తున్న ‘పైక్సిస్ పయనీర్’ నౌకలు ఆదివారం ఉదయం కర్ణాటకలోని మంగళూరు ఓడరేవుకు చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు స్థిరీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది.

Read Also: Iran War: కోవిడ్ తర్వాత అతిపెద్ద ‘‘లాక్‌డౌన్’’కు ప్రపంచం సిద్ధమవుతోందా..?

నిజానికి రష్యా నుంచి వస్తున్న ఆక్వా టైటాన్ ముందుగా చైనా వెళ్లాల్సి ఉంది. అయితే, సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతించడంతో, దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ నౌక భారత్‌కు వచ్చింది. ఇక అమెరికా లోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువచ్చిన మరో నౌక భారత్ చేరింది. దీంతో ఒకే సమయంలో ఇటు రష్యా, అటు అమెరికా నుంచి భారత్ తన ఇంధనాన్ని రప్పించుకుంది. ఒకే సమయంలో రెండు దేశాల నుంచి ఇంధనాన్ని తెప్పించుకుకోవడం భారత దౌత్య విజయమని నిపుణులు చెబుతున్నారు.