Reading Time: < 1 minute

ప్రతీ ఎకరానికి సాగునీరు అందించడమే ధ్యేయం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Caption of Image.

నల్గొండ అర్బన్, వెలుగు :  నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యేయమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శనివారం నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో పర్యటించిన ఆయన, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాగునీటి కాలువలను స్వయంగా ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కొండపాక గూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా నిర్మించనున్న పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాలువ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలని అధికారులను 
ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.