Reading Time: < 1 minute

తిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన

Caption of Image.

తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైరబైలు పంచాయితీ పరిధిలో  ఫారెస్ట్‌ బంగ్లా సమీపంలోని అటవీప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె తగిలి ఏనుగులు మృతి చెందాయి.  సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.