Reading Time: < 1 minute

చీపుర్లు పట్టి  రోడ్డు ఊడ్చిన ఎంపీడీఓ,సర్పంచ్

Caption of Image.

మద్దూరు,వెలుగు:  ప్రభుత్వం  ప్రారంభించిన ప్రజా పాలన, 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మద్దూరు మండలంలోని చెన్నారెడ్డి పల్లి,పెదిరిపహడ్ జీపీ  హామ్లెట్ కోతుల గుట్ట తండాల్లో ఆదివారం ఎంపీడీఓ రామన్న పర్యటించారు. సర్పంచ్ కనకప్ప,అనసూయ తో కలసి వీధులు  ఊడ్చారు.

ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి,  రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు  తీసి  జీపీ ట్రాక్టర్ లో వేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు. డ్రైనేజీని ఎప్పటకప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని  ఆదేశించారు.   99 రోజులు ప్రణాళికలో గ్రామాలను పరిశుభ్రంగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు. 
 

©️ VIL Media Pvt Ltd.